ప్రకాశం జిల్లాలో దారుణం : తండ్రీ కొడుకులపై ప్రత్యర్థుల దాడి

prakasham district murder case
Highlights

కొడుకు మృతి, తండ్రి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ముడ్లమూరు మండలంలోని రమణారెడ్డి పాలెంకు చెందిన  తండ్రీ కొడుకులపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొడుకు చనిపోగా తండ్రి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రమణా రెడ్డి పాలెం కు చెందిన వెంగళ్ రెడ్డి, కొండా రెడ్డి లు తండ్రీ కొడుకులు. అయితే వీరిద్దరు ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టులో హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. కత్తులతో, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో కొడుకు కొండా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి వెంగళ్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఇతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఇతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ దాడిపై కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. 

 

loader