మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు.. సినీతారలకు చుక్కెదురు

మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు.. సినీతారలకు చుక్కెదురు

రెండు మూడు నెలల క్రితం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఫోన్ నంబర్లు, కాల్ డేటా ఆధారంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నియమించిన సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్, హీరోలు తరుణ్, నవదీప్,తనీష్, సుబ్బరాజు, నందు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులను ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు కూడా. కాగా.. తర్వాత ఈ కేసు అక్కడితో ముగిసిందనే అనుకున్నారు అందరూ. ఎందుకంటే.. పోలీసులు ఈ కేసుపై తర్వాత ఎక్కడా ప్రస్తావించలేదు.

కాగా.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. సిట్ అధికారుల దర్యాప్తు చివరి  దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రగ్స్ కేసులో ఆరోపణలు అందుకున్న సినీ తారలందరి బ్లడ్ సాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. దాని రిజల్ట్ కూడా వచ్చేసిందని, ఆ రిపోర్టును కోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. ఆ రిపోర్టులో  దాదాపు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిపై సిట్ ఫైనల్ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిందట. కోర్టు తీర్పు ఇవ్వడం ఒక్కటే తరువాయి అన్న ప్రచారం ఊపందుకుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page