శ్రీరెడ్డి పై పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు

శ్రీరెడ్డి పై పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ వివాదాస్పద నటి  శ్రీరెడ్డి పై పోలీసు ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ వద్ద దుస్తులు విప్పేసి.. అర్థ నగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె ప్రవర్తను ఒక్కసారిగా టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ తిన్నది. మీడియా అంతా అక్కడికి చేరి.. ఆమె అలా చేయడానికి కారణం
ఏమిటంటూ.. ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె ప్రదర్శనను అడ్డుకున్నారు.

మా అసోసియేషన్ ద్వారా కొన్ని బాధలు ఉన్నాయని.. వాటికి నిరసనగానే అర్థనగ్న ప్రదర్శనకు దిగినట్లు  నటి శ్రీరెడ్డి చెప్పారని పోలీసు అధికారి చెప్పారు. నిరసనను వ్యక్తం చేసేందుకు అనేక పద్దతులు ఉన్నప్పటికీ ఇలా చేయడం సరికాదని శ్రీరెడ్డికి చెప్పామన్నారు. తనకు జరిగిన అన్యాయంపై శ్రీరెడ్డి ఎక్కడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని...
కేవలం మీడియా ముందు మాత్రం కొందరికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
 
కేవలం తనపై అందరి దృష్టిని ఆకర్షించడానికే శ్రీరెడ్డి ఇలాంటి నిరసనకు దిగినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఏ సమస్య ఉన్నా ఫిర్యాదు చేయాలని, తగిన చర్యలు తీసుకుంటామని  శ్రీరెడ్డికి చెప్పామని...అయితే ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page