వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్

వన్ ప్లస్  స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్

వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఆ సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎంతో కలిసి యూజర్లకు ఉచితంగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా టిక్కెట్లను అందిస్తున్నది. అందుకు యూజర్లు https://www.oneplus.in/avengers అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం వచ్చే స్క్రీన్‌లో వన్ ప్లస్ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేస్తే టిక్కెట్ కూపన్ కోడ్, వెబ్‌సైట్ లింక్ జనరేట్ అవుతాయి. ఆ లింక్‌ను యూజర్లు ఓపెన్ చేయాలి.

ఈ క్రమంలో యూజర్లు తమకు కావల్సిన సిటీని ఎంచుకుని ఆ సిటీలో ఉన్న పీవీఆర్ థియేటర్లలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రదర్శింపబడే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాకు చెందిన ఏదైనా షోను ఎంచుకోవాలి.  అయితే.. కేవలం పేటీఎం నుంచి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ ఉచితంగా లభిస్తుంది.  దీంతోపాటు కాంప్లిమెంటరీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్‌ను అందిస్తారు. వాటికి సంబంధించిన క్యాష్ బ్యాక్ యూజర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. అయితే వన్ ప్లస్ ఇలా మొదటి 6వేల మందికి మాత్రమే అవెంజర్స్ సినిమా టిక్కెట్లను ఉచితంగా అందిస్తున్నది. కనుక యూజర్లు త్వరపడితే ఎంచక్కా ఓ సినిమా టిక్కెట్‌ను ఉచితంగా పొందవచ్చు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos