Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి ఒకినామా విద్యుత్ స్కూటర్ ‘ప్రైజ్ ప్రో’.. ధరెంతంటే?

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  ఇండియాలో లాంచ్‌  చేసింది. దీని  ధరను రూ. 71,990గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌ను తెచ్చామని ఒకినావా తెలిపింది.
 

Okinawa Scooters launches PraisePro at Rs 71990
Author
New Delhi, First Published Sep 6, 2019, 11:59 AM IST

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  ఇండియాలో లాంచ్‌  చేసింది. దీని  ధరను రూ. 71,990గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌ను తెచ్చామని ఒకినావా తెలిపింది.

ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యం కానున్నది. ఒక్కసారి చార్జి చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని ఒకినామా తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకోవడంలో గణనీయ ప్రగతి సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. భారతీయ కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలని భావిస్తుందన్నారు. 

లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు. 

ఈ వాహనాలపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించడంతో ఇది అత్యంత చౌకైన స్కూటర్‌ అని జితేందర్ శర్మ తెలిపారు. ఐ-ప్రైజ్ 2కే వాట్ల రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, 1కే డబ్ల్యూ బ్రష్ లెస్ డీసీ ఎలక్ట్రిక్ మోటార్ (బీఎల్డీసీ), వాటర్ ప్రూఫ్, 2.5 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం గల ఇంజిన్‌ కలిగి ఉంటుంది. 

ఎకానమీ మోడల్ స్కూటర్ గంటకు 30-35 కిలోమీటర్ల వేగం, స్పోర్ట్ 50-60, టర్బో 65-70 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఎల్ఈడీ లైట్లు గల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అలారం, ఫైండ్ మై స్కూటర్ పంక్షన్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్, వాక్ అసిస్ట్ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది. మూడేళ్లు లేదా 20 కిలోమీటర్ల ప్రయాణం వరకు వారంటీ ఉంటుంది. 

ఒకినోవా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సెంట్రల్ లాకింగ్ విత్ యాంటీ-తెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ యుఎస్‌బీ పోర్ట్ ,  మోటర్ వాకింగ్ అసిస్ట్ విత్ ఫ్రంట్ అండ్‌ రివర్స్ మోషన్ తదితర కొన్ని ఆసక్తికర ఫీచర్లను జోడించింది.  ఒకినావా ప్రైజ్‌ప్రోలో 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios