Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ షాక్: నో వర్క్ పర్మిట్, భారతీయులపై తీవ్రమైన దెబ్బ

హెచ్ 1బి వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇవ్వడానికి సిద్ధపడింది.

No work permits for H1b Visa spouses: Trump

వాషింగ్టన్: హెచ్ 1బి వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇవ్వడానికి సిద్ధపడింది. వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. 

హె1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్దంగా పనిచేసే అవకాశాన్ని నిరోధించే ప్రణాళిను ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేస్తోందని టాప్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి ఒకరు చెప్పారు. 

తన నిర్ణయం ద్వారా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోని నిబంధనలకు స్వస్తి చెప్పాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. వేసవి తర్వాత ఈ ఒబామా హయాంనాటి నిబంధనలను రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్మా సెనేటర్ చుక్ గ్రాస్లేకు అందించిన ఓ లేఖలో తెలిపారు. 

కఠినమైన నిబంధనలతో భారత ఐటి పరిశ్రమను ఇప్పటికే ప్రమాదంలోకి నెట్టిన ట్రంప్ తాజా నిర్ణయంతో బారతీయులపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం వేసేందుకు సిద్ధపడ్డారు. వేలాది మంది బారతీయులపై దాని ప్రభావం పడుతుందని అంటున్నారు. 

తాజా నిర్ణయం వల్ల హెచ్ -4 వీసాపై పనిచేస్తున్న 7వేల మంది భారతీయ ఐటి నిపుణులను దెబ్బ తీస్తుందని అచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు అవుతాయని అంటున్నారు.

హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్ -4 వీసా ద్వారా అమెరికాలో చట్టబద్దంగా పనిచేసే అవకాశం ఉంది.  ఈ వీసాపై అమెరికాలో పనిచేసేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు లక్ష మంది దాకా హెచ్ -4 వీసాపై పనిచేస్తున్నట్లు అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios