Asianet News TeluguAsianet News Telugu

టిటిడి బోర్డు నుండి అనిత ఔట్

టిటిడి బోర్డు నుండి అనిత ఔట్

MLA Anitha removed from TTD Board

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా పాయకరావు పేట ఎమ్మెల్యే అనితని తొలగిస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అనిత హిందువు కాదని ఓ క్రిస్టియన్ అంటూ ఆరోపణలు రావడం, ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆమెను తొలగించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా విడుదలయ్యాయి.

టిటిడి బోర్డు చైర్మన్ ను సభ్యులను నియమిస్తూ గత వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సభ్యుల ఎంపిక విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. టిడిపి చైర్మన్ గా నియమితులైన పుట్టా సధాకర్ యాదవ్ కూడా క్రిస్టియన్ అంటూ ప్రచారం జరిగింది. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఇక బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన పాయకరావు ఎమ్మెల్యే అనిత విషయంలోనే ఇదే వివాదం చెలరేగింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో తాను క్రిష్టియన్ ను అని,ఎపుడై బైబిల్ ను వెంటపెట్టుకుని ఉంటానని చెప్పిన వీడియో హల్ చల్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు వ్యతిరేకంగా హిందూ ధార్మిక సంస్థలు, ప్రజలు నిరసనలు చేపట్టారు. టిటిడి బోర్డు మెంబర్ పదవి నుండి  ఆమెను తొలగించాలని పట్టుబట్టాయి.  

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత కూడా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని, తనని బోర్డు మెంబర్ స్థానం నుండి తొలగించాలని స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది. దీంతో తాజాగా ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం జివొ విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios