Asianet News TeluguAsianet News Telugu

ఆటోమొబైల్ సొల్యూషన్స్ : స్టార్టప్స్‌తో మారుతి టై-అప్

ఆటోమొబైల్ రంగంలో తలెత్తే సమస్యలను ఇన్నోవేటివ్ పరిష్కారాలను కనుగొనేందుకు మారుతి సుజుకి ఐదు స్టార్టప్ సంస్థలతో జత కట్టింది.

Maruti collaborates with five start-ups
Author
Hyderabad, First Published Oct 15, 2019, 12:05 PM IST

ఆటోమొబైల్ సొల్యూషన్స్ : స్టార్టప్స్‌తో మారుతి టై-అప్ న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్‌మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో మారుతి సుజుకి జత కట్టింది. ఈ ఒప్పందాలతో ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది.

మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి ఆయుకావా చెప్పారు.

ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా ఆటోమొబైల్ సొల్యూషన్‌ కొత్త యుగంలోకి ప్రవేశించామని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ కెనిచి ఆయుకావా పేర్కొన్నారు. స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ సొల్యూషన్స్ ఆటోమొబైల్ రంగంలో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయ పడతాయని మారుతి సుజుకి ఎండీ కం సీఈఓ కెనిచి ఆయుకావా అన్నారు. సమస్యలను ఐడెంటిఫై చేయడంతోపాటు ఇన్నోవేటివ్‌గా కట్టింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యం అని చెప్పారు.

ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్‌ మార్కెట్‌ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ యాక్సలరేషన్‌ కార్యక్రమం ఉంటుందని మారుతి సుజుకి ఎండీ కెనిచి ఆయుకావా చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios