ఈ యువ‌కుడు మాత్రం ఓ సంవత్సరం పిల్లాడిలా కనిపిస్తాడు. సంవత్సరం పిల్లాడు ఎంత ఎత్తు, బరువు ఉంటాడో ఈ వ్యక్తి కూడా అంతే బరువు, ఎత్తు ఉంటాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు.. సాక్షాత్తూ దేవుడి అవతారమే అని స్థానికులు కూడా కొలుస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. అది హర్యానాలోని హిస్సార్. 1995వ సంవత్సరం. మన్‌ప్రీత్ సింగ్ జన్మించాడు. పుట్టినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. పుట్టిన ఓ సంవత్సరం తర్వాత మన్‌ప్రీత్‌కు ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. తన పెరుగుదల ఆగిపోయింది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించారు మన్‌ప్రీత్ పేరెంట్స్. పరీక్షించిన డాక్టర్లు అత‌డికి హార్మోన్ సిండ్రోమ్ ఉందని చెప్పారు. వైద్యం చేయించడానికి లక్షలు ఖ‌ర్చ‌వుతాయ‌ని తెలిపారు. అసలే పేదరికం.. లక్షలు ఖర్చుపెట్టి మన్‌ప్రీత్ వైద్యం చేయించలేక.. మన్‌ప్రీత్ మాత్రం సంవత్సరం వయసులోనే ఆగిపోయాడు. వైద్య శాస్త్రం ప్రకారం చూస్తే.. అతడికి వచ్చిన వ్యాధి చాలా అరుదైనదని.. దాన్నే లారోన్ సిండ్రోమ్ అంటారని తేల్చారు. అయితే.. మన్‌ప్రీత్ శారీరకంగా ఎదగకపోయినా.. తోటి పిల్లలతో ఆడుతూ సరదాగా గడుపుతూ తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.మన్‌ప్రీత్ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును భరించలేక.. అతడి బంధువులు చేతులెత్తేశారట.  జీవితాంతం పిల్లాడిగానే ఉండేందుకు సిద్ధమయిపోయాడు మన్‌ప్రీత్.