సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేటలో అత్యంత నికృష్టమైన సంఘటన చోటు చేసుకుంది. వావివరుసలు మరిచిన ఓ కామాంధుడు చిన్నమపై అత్యాచారానికి తెగించాడు. నోట్లో చీరను కుక్కి, తాళ్లతో కట్టేసి అత్యాచారం చేశాడు. 

బాధితురాలు అసలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే కొడుకులాంటివాడిపై నిందలేస్తావా అంటూ వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు. తీవ్రమైన గాయాలతో ఆమె ప్రస్తుతం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

రాజా నాయక్ తండాకు చెందిన బాధితురాలి భర్త ఏడాది క్రితం ఓ ప్రమాదంలో మరణించాడు. దాంతో కూలిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. ఆమె ఇంటికి దగ్గరలోనే తన భర్త తరఫు కుటుంబం నివాసం ఉంటోంది. 

ఆ కుటుంబానికి చెందిన శ్రీకాంత్ బాధితురాలిపై కన్ను వేశాడు. అతను వరుసలకు కుమారుడవుతాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నమ్మ నోట్లో బలవంతంగా చీర కుక్కి తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆమెను బయటకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆ సమయంలో స్పృహలోకి వచ్చిన మహిళ కేకలు వేసింది. అయితే నోరు నొక్కేసి తాళ్లతో కట్టేసి అత్యాచారం చేశాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. పోలీసులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.