ప్రాణాలను అరచేతపట్టుకొని.. ఇతనేం చేశాడో చూడండి.

ప్రాణాలను అరచేతపట్టుకొని.. ఇతనేం చేశాడో చూడండి.

ఐదు,ఆరు అంతస్థుల పై నుంచి కిందకి చూస్తేనే.. కొందరికి కళ్లు తిరుగుతుంటాయి. ఎక్కడ కింద పడిపోతామో అని భయపడిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి ప్రాణాల ను అరచేత పట్టుకొని 23వ అంతస్థు నుంచి వేలాడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాలు ఇలా ఉన్నాయి.

 యాహూ న్యూస్‌ కథనం ప్రకారం.. డిసెంబర్ 13వ తేదీన చోంగ్‌క్వింగ్‌ నగరంలోని ఓ బహుళాంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రమాదం జరిగిన అంతస్థు నుంచి బయటపడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 23వ అంతస్థు నుంచి కిందికి వేలాడాడు. తన ఎదురుగా ఉన్న అద‍్దాలు పగలకొట్టి, ఆ ఫ్లోర్‌లోకి దూకేందుకు తీవ్రంగా యత్నించాడు. 

పై నుంచి అగ్ని కీలలు పడుతున్నా అతను పట్టు విడవలేదు. దూరం నుంచి ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. అయితే చివరకు అతను బతికాడా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అద్దాలు పగల కొట్టి అతన్ని లోపలికి లాగి రక్షించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page