రూ.2,400కే లావా తాజా స్మార్ట్ ఫోన్

రూ.2,400కే లావా తాజా స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి తాజా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. తొలిసారిగా దేశీయ ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ ప్రొగ్రామ్‌లో భాగంగా జడ్‌50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2400కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 10వేలకు పైగా రిటైల్‌ స్టోర్లలో, అదేవిధంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ ఛానళ్లలో అందుబాటులో ఉంచినట్టు లావా పేర్కొంది.

బ్లాక్‌, గోల్డ్‌ రంగుల ఆప్షన్లలో ఇది లభ్యమవుతోంది. ఈ లావా జడ్‌50 అసలు మార్కెట్‌ ఆపరేటింగ్‌ ధర 4,400 రూపాయలు. ఎయిర్‌టెల్‌ ఈ ఫోన్‌పై రూ.2000 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించడంతో, దీని ధర 2,400 రూపాయలకు దిగొచ్చింది. అయితే కస్టమర్లు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే, తొలి 18 నెలలు రూ.3500తో, 19 నుంచి 36 నెలల మరో రూ.3500తో తమ ఎయిర్‌టెల్‌ అకౌంట్లలో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఈ ఫోన్‌ను రెండేళ్ల వారెంటీతో మార్కెట్‌లోకి వచ్చింది.

లావా జెడ్50 ఫీచర్లు..

4.5 ఇంచెస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌),2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌,క్వాడ్‌-కోర్‌ 1.1గిగాహెడ్జ్‌ మీడియాటెక్‌ ఎంటీ6737ఎం ఎస్‌ఓసీ
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 5 మెగాపిక్సెల్‌ వెనక కమేరా,5 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos