Asianet News TeluguAsianet News Telugu

కథువా రేప్ కేసు: అసలు ఏం జరిగింది, ఎలా చేశారు...

థువా అత్యాచారం కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత నాలుగు రోజులకు ఎనిమిదేళ్ల బాలికను చంపినట్లు ప్రధాన నిందితుడు సాంజీ రామ్ దర్యాప్తు అధికారులకు చెప్పారు. 

Kathua Rape case: Sankiram planned to kill to save son

జమ్ము: కథువా అత్యాచారం కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత నాలుగు రోజులకు ఎనిమిదేళ్ల బాలికను చంపినట్లు ప్రధాన నిందితుడు సాంజీ రామ్ దర్యాప్తు అధికారులకు చెప్పారు. 

లైంగిక దాడిలో తన కుమారుడు పాల్గొన్నాడని తెలిసి, అతన్ని రక్షించడానికి బాలికను నాలుగు రోజుల తర్వాత హత్య చేశానని అతను చెప్పాడు. 

బాలికను జనవరి 10వ తేదీన కిడ్నాప్ చేశారు. అదే రోజున సాంజీ రామ్ మేనల్లుడు అత్యాచారం చేసాడు. అతను మైనర్. ఆ తర్వాత జనవరి 14వ తేదీన ఆమెను చంపేశారు. అటవీ ప్రాంతంలో ఆమె శవం జనవరి 17వ తేదీన బయటపడింది.

మైనర్ బాలుడితో పాటు సాంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, మరో ఐదు మందిపై కేసులో అభియోగాలు మోపారు. కథువా రేప్ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసినవారికి మరణశిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 

బాలికపై అత్యాచారం జరిగిన విషయం తనకు జనవరి 13వ తేదీన తెలిసిందని సాంజీ రామ్ చెప్పాడు. తన మేల్లుడు ఆ విషయాన్ని అంగీకరించాడని అన్నారు. 

తాను పూజలు చేసి, ప్రసాదం ఇంటికి తీసుకుని వెళ్లాలని తన మేనల్లుడికి చెప్పానని, అయితే అతను ఆలస్యం చేస్తూ వచ్చాడని, దాంతో ఆగ్రహించి అతన్ని కొట్టానని సాంజీ రామ్ దర్యాప్తు అధికారులకు చెప్పాడు. 

తాను బాలికపై అత్యాచారం చేశానని తన మామ సాంజీరామ్ గుర్తించాడని మైనర్ బాలుడు భావించాడు. దాంతో విషయం చెప్పాడు. ఆ మైనర్ బాలుడు సాంజీరామ్ కుమారుడు విశాల్ కూడా అత్యాచారం చేసినవారిలో ఉన్నాడని చెప్పాడు. ఇద్దరు కలిసి దేవాలయంలో బాలికపై అత్యాచారం చేశారు. 

అది తెలిసి సాంజీ రామ్ బాలిక హత్యకు పథకం వేశాడు. ఆ బాలికను చంపితే సంచార జాతులను భయపెట్టే తన లక్ష్యం కూడా నెరవేరుతుందని సాంజీ రామ్ భావించాడు. 

జనవరి 13, 14 తేదీల మధ్య రాత్రి మైనర్ బాలుడు, విశాల్, ఓ మిత్రుడు, ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్ను బాధితురాలిని దేవస్థానం నుంచి బయటకు తీసుకుని వెళ్లారు. వారితో ప్రత్యేకాధికారి దీపక్ ఖజూరియా జత కూడాడు. హత్య చేయడానికి ముందు తాను మరోసారి బాలికపై అత్యాచారం చేస్తానని అతను చెప్పాడు. అయితే పథకం అనుకున్న ప్రకారం అమలు కాలేదు. 

జనవరి 14వ తేదీన ఆమెను హత్య చేశారు. తన కుమారుడికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించకూడదనే ఉద్దేశంతో సాంజీరామ్ ఆమెను చంపేశాడు. 

ఆ తర్వాత ఆమె శవాన్ని తీసుకుని వెళ్లి సమీపంలోని హరీనగర్ కాలువలో పడేయాలని అనుకున్నారు. అయితే, సరైన సమయంలో వాహనం రాలేదు. దాంతో మైనర్, విశాల్, ఖజూరియా,త మన్ను శవాన్ని ఎత్తుకుని వెళ్లి మళ్లీ దేవస్థానంలో ఉంచారు. సాంజీ రామ్ దీన్నంతా పర్యవేక్షించాడు. 

తన మిత్రుడు కారు తేవడానికి నిరాకరించాడని, అందువల్ల శవాన్ని అడవుల్లో పారేయాలని సాంజీ రామ్ తన కుమారుడికి, మేనల్లుడికి చెప్పినట్లు తదుపరి దర్యాప్తులో తేలింది. 

నిజానికి బాలికను కిడ్నాప్ చేయాలనే పథకం జనవరి 7వ తేదీన ప్రారంభమైంది. ఆ రోజు మత్తు పదార్థాలు, బంగ్ కొనుగోలు చేసినట్లు చార్జిషీట్ లో తెలిపారు. 

బాలికకు బంగ్ ఇచ్చారు. దాదాపు 15 కిలోల బరువు గల చాపలో చుట్టి దేవస్థానంలో ఉంచారు. మైనర్ బాలుడిపై, విశాల్, ఖజూరియా, సురీందర్ వర్మ, అతని మిత్రుడు మన్నులపై  దర్యాప్తు అధికారులు మరో చార్జిషీట్ దాఖలు చేశారు.

సబ్ ఇన్ స్పెక్టర్ ఆనంద్ దత్త, కానిస్టేబుల్ తిలక్ రాజ్ సాంజీ రామ్ నుంచి 4 లక్షల రూపాయల లంచం తీసుకుని సాక్ష్యాధారాలను మాయం చేశారు. 

మైనర్ శవాన్ని పారేసిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి దర్యాప్తు అధికారులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. శవాన్ని అడవుల్లో పారేసిన తర్వాత జనవరి 15వ తేదీ సాయంత్రం హీరానగర్ లోని కాలువ వద్ద ఆడుకుంటున్న మిత్రుల వద్దకు వెళ్లాడు. హత్య చేసిన విషయాన్ని మిత్రుడు అమిత్ శర్మకు చెప్పాడు. ఆ తర్వాత సాయంత్రం మీరట్ నుంచి తిరిగి వచ్చిన విశాల్ తో చేరాడు. 

దర్యాప్తు అధికారులు అమిత్ శర్మ వాంగ్మూలాన్ని ప్రాథమిక సాక్ష్యాధారంగా మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. ఆ తర్వాత జనవరి 23వ తేదీన కేసును ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించింది. క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios