చిన్నారి రేప్ కేసులో మీడియాకి షాక్ ఇచ్చిన కోర్టు

చిన్నారి రేప్ కేసులో మీడియాకి షాక్ ఇచ్చిన కోర్టు

కఠువా అత్యాచారం కేసులో  మీడియాకి న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. బాధితురాలి పేరును బహిరంగపర్చిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు కొరడా రుళిపించింది. ఆమె పేరును వెల్లడించిన మీడియా సంస్థలన్నీ రూ.10 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందేలా పరిహారం నిధిలో జమచేయాలని ధర్మాసనం నిర్ణయించింది. ఇకపై అత్యాచారం కేసులో బాధితుల పేర్లు వెల్లడిస్తే ఆరునెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
 
జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఎనిమిదేళ్ల ఓ బాలికపై కొందరు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆపై దారుణంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటనపై బాధితురాలి పేరును కూడా కొన్ని మీడియా సంస్థలు వెల్లడించడంతో హైకోర్టు ఈ నెల 13న ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇకపై బాధితురాలికి చెందిన ఎలాంటి గుర్తింపు బయటికి పొక్కకుండా చూడాలని ఆదేశించింది.


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page