సిద్ధారామయ్యకు ‘షాక్’

సిద్ధారామయ్యకు ‘షాక్’

కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. సిద్ధారమయ్య అనుచరుడు, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి మహదేవప్పకు చెందిన ఇళ్లపై సోమవారం ఐటీ అధికారులు దాడులు చేసిందని, బెంగళూరు, మైసూరుల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయని, పెద్దమొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సీఎం సిద్ధరామయ్య (బాదామి స్థానం నుంచి) నామినేషన్‌ దాఖలు చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఈ వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ.. కేంద్ర సంస్థలను రంగంలోకి దింపి, కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే.. ఆదాయపన్ను శాఖ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము సోమవారం ఐటీ సొదాలు నిర్వహించిన మాట వాస్తవేమనన్నారు. కాకపోతే.. అది మంత్రి మహదేవప్ప ఇంట్లో మాత్రం కాదని, నలుగురైదుగురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో మాత్రమే సోదాలు నిర్వహించామని తెలిపారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos