Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ లో ‘ఆ’ ప్రయోగం ట్రై చేస్తున్నారా ?

  • లైంగిక క్రీడలో కొత్త కొత్త ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగిన పురుషులు యానల్‌ సెక్స్‌ కూడా ప్రయత్నించటానికి ఇష్టపడుతూ ఉంటారు.
Is Anal Sex Dangerous

పోర్న్ సినిమాలను ఎక్కువగా చూసేవారికి యానల్ సెక్స్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. దీనిని అబ్బాయిలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. చాలా మంది జంటలు దీనిని ఇప్పటికే ట్రై చేసి ఉంటారు. అయితే.. అసలు ఈ యానల్ సెక్స్.. నిజంగా ఆరోగ్యకరమేనా..? దీనివల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా ..? ఇప్పుడు చూద్దాం..

లైంగిక క్రీడలో కొత్త కొత్త ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగిన పురుషులు యానల్‌ సెక్స్‌ కూడా ప్రయత్నించటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నం ఆరోగ్యకరమైనది కాదు. ఇతర లైంగిక క్రీడలకంటే యానల్‌ సెక్స్‌ ద్వారా లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పైగా మల ద్వారం లోపలి లైనింగ్‌ ఎంతో పలుచగా ఉంటుంది.

ఏమాత్రం ఒరిపిడి కలిగినా డ్యామేజ్‌ అవుతుంది. ఇలా డ్యామేజ్‌ అయితే ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకుతాయి. యానల్‌ సెక్స్‌ ద్వారా క్లమీడియా, జెనైటల్‌ హెర్పిస్‌, జెనైటల్‌ వార్ట్స్‌, గొనేరియా, హెపటైటిస్‌ బి, సిఫిలిస్‌, హెచ్‌ఐవి సంక్రమిస్తాయి. ఇవేకాకుండా యానల్‌ సెక్స్‌ ద్వారా హెపటైటిస్‌ ఎ, లేదా ఇ. కొలై అనే ఇన్‌ఫెక్షన్లు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. మల ద్వారంలో వేళ్లు జొరపటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి లైంగికపరమైన వ్యాధులు సంక్రమిస్తాయి. యానల్‌ సెక్స్‌లో కండోమ్‌ వాడటం కూడా సురక్షితం కాదు.

అంతేకాకుండా ఈ యానల్ సెక్స్ చాలా నొప్పిని కలిగిస్తుంది. చాలామంది భార్యలు ఈ మధ్యకాలంలో తమ భర్తను ఈ అసహజ శృంగార ధోరణికి విసిగిపోయి, విడాకులు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకం సెక్స్ కి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ యానల్ సెక్స్ లో విదేశీయులు ఎక్కువగా పార్టిసిపెంట్ చేస్తుంటారు. అక్కడి నుంచే ఈ సంస్కృతి మన దేశానికి పాకుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios