ఇటీవల ఇండియా, బంగ్లాదేశ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో చివర్లో మ్యాజిక్ చేసి.. టీం ఇండియాను గెలిపించాడు దినేష్ కార్తీక్.  చివరి బంతిని సిక్స్ కొట్టి హీరోగా నిలిచాడు. అతని సిక్స్ కి క్రికెట్ అభిమానులంతా ఫిదా అయ్యారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాగా.. దినేష్ కార్తీక్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దినేష్.. మొదటి భార్యను మరో  ఇండియన్ క్రికెటర్ వివాహం చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... దినేష్ కార్తీక్..2007లో నిఖితాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. దీంతో.. ఆ స్నేహం ప్రేమగా మారి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. కాగా.. నిఖితాకు 2012 లో ఐపీల్ 5 మ్యాచ్ సమయంలో క్రికెటర్ మురళీ విజయ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దినేష్ కార్తీక్ ఎలాంటి వివాదం చేయకపోవడం గమనార్హం. వారిద్దరి బంధానికి గౌరవం ఇచ్చి.. భార్య నిఖితకు విడాకులు ఇచ్చేశాడు. అనంతరం నిఖిత, మురళీ విజయ్ లు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా దీపిక పల్లికల్ అనే యువతి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం టీం ఇండియా క్రికెటర్ షమీ పై ఆయన భార్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. క్రికెటర్ దినేష్ కార్తీక్ మొదటి వివాహం విషయం , విడాకులు తదితర విషయాలు మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.