పై ఫోటో కనిపిస్తున్న వస్తువును చూశారా..? అదేంటో చిన్న ప్లాస్టిక్ ముక్క అనుకునేరు. అది కంప్యూటర్. ఐబీఎం కంపెనీ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన కంప్యూటర్ ఇది. కేవలం 1×1 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ డివైజ్  నిజానికి ఇంకా చిన్నదిగా ఉంటుంది. మైక్రో లెన్స్ కారణంగా  ఈ మాత్రమైనా కనపడుతోంది. ఈ కంప్యూటర్ ఎలాంటి కేబుల్స్, కనెక్షన్ అవసరం లేకుండా తనంతట తానే విడి గా పనిచేస్తుంది. అసలు ఇదే ఇంత చిన్నగా ఉంటే, దీనిలోపల మళ్లీ కొన్నివేల ట్రాన్సిస్టర్లు పొందుపరచబడి ఉంటాయి. అలాగే లైవ్ మెమరీ, కాంతి నుండి విద్యుత్ నిక్షిప్తం చేసుకునే సదుపాయం లభిస్తుంటాయి. ఇంతకీ దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.. కేవలం6 రూపాయలు. అవును, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

అలా అని ఇది చాలా సాధారణమైన కంప్యూటర్ అని ఫీలవ్వకండి. 1990వ దశకంలో చాలామంది వాడినా x86 డెస్క్టాప్ కంప్యూటర్లు ఎంత శక్తివంతంగా ఉండేవో ఇది కూడా అంటే శక్తివంతంగా ఉంటుంది. కేవలం శక్తివంతంగా ఉండటం మాత్రమే కాదు, ఫ్రాడ్‌ని నిరోధించటానికి బ్లాక్ చైన్ టెక్నాలజీలో డేటాని రికార్డు చేయగలిగే సామర్ధ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. అంతేకాదు రక రకాల వస్తువులకు తగిలించబడే ట్యాగ్స్ కి దీన్ని అటాచ్ చేయొచ్చు, మనమో కాదో వెరిఫై చేసి అథంటికేషన్ చేసే డివైజ్లలో ఉపయోగించవచ్చు. చాలా తక్కువ ధరకే ఈ చిన్న కంప్యూటర్ లభిస్తుండటం వలన దీని ఎక్కడ అవసరమైతే అక్కడ విరివిగా వాడటానికి అవకాశముంటుంది.