హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య

First Published 26, Apr 2018, 8:29 PM IST
hyderabad triple it student suicide
Highlights

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్ లో కలకలం రేపింది. గచ్చిబౌలి లోని క్యాంపస్ లో పులి సనందకుమార్ రెడ్డి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన సునందకుమార్ రెడ్డి గచ్చిబౌలి ట్రిపుల్ ఐఐటీ లో చదువుకుంటున్నాడు. అయితే ఇవాళ ఎవరూ లేని సమయంలో కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను ప్రశ్నించారు. మానసిక ఒత్తిడితోనే సునందకుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

   
 

loader