ఐదు నక్షత్రాల హోటళ్లల్లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు(వీడియో)

First Published 17, Dec 2017, 10:38 AM IST
hitech sex racket busted in Hyderabad star hotel
Highlights

విమానాల ద్వారా యువతుల్ని తెప్పిస్తున్న నిర్వాహకులు

ఫైవ్ స్టార్ హోటళ్లే కేంద్రంగా గుట్టుగా సాగుతోంది హైటెక్ సెక్స్ రాకెట్. ఆన్ లైన్ ద్వారా సంపన్నులైన విటుల్ని ఆకర్షిస్తున్నారు. గ్యాంగులు. ఈ హైటెక్ వ్యభిచార కేంద్రాలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

బాలీవుడ్ హీరోయిన్లు, సీరియల్ తారలను హైదరాబాద్ కు రప్పిస్తున్నారు నిర్వాహకులు.. పేరుగాంచిన తాజ్ దక్కన్, తాజ్ బంజారా హోటళ్లపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరుగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు ఆధ్వర్యంలో పోలీసులు రైడ్స్ చేశారు. మిడియా రిపోర్టుల ప్రకారం బంజారాహిల్స్ తాజ్ దక్కన్ హోటల్లోని రూమ్ నెంబర్ 328లో బాలీవుడ్ హీరోయిన్ రీచా సక్సేనా, కాస్ట్యూమ్ డైరెక్టర్ మోనిక్  టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. బాలీవుడ్ జూనియర్ 143 ఫేమ్ హీరోయిన్ రీచా సక్సేనా, కాస్ట్యూమ్ డిజైనర్ మోనిక్ లను అరెస్ట్ చేసి.. వీరి నుంచి 50 వేల రూపాయల నగదు పాటు.. కండోమ్ ప్యాకెట్లను సీజ్ చేశారు పోలీసులు.

loader