హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ ...బాలీవుడ్ తారలు అరెస్టు (వీడియో)

First Published 17, Dec 2017, 10:46 AM IST
hightech sexrocket busted in hyderabad bollywood actors arrested
Highlights
  • హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది.

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది. సెలబ్రిటీ స్టేటస్ మాటున హోటళ్లకు వస్తూ వారు చేస్తున్న నిర్వాకాన్ని  పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. శనివారం నగరంలోని తాజ్ డెక్కన్, తాజ్ బంజారా హోటళ్లలో పోలీసులసు దాడులు చేయగా ఇద్దరు బాలీవుడు నటీమణులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు శుక్రవారం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బడా వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని వీరు ఈ హైటెక్ వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం.

 

అరెస్టయిన వారిలో బాలీవుడ్ నటి రీచా సక్సేనా, బెంగాలీ నటి శుభ్రచటర్జీ (బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తోంది), నిర్వాహకుడు మోనిక్‌లు ఉన్నారు. వీరిలో ఒక నటి తాజ్ డెక్కన్‌లో, మరో నటి తాజ్ బంజారాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. విటుల రూపంలో వెళ్లి వీరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన జనార్ధన్ అలియాస్ జానీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

loader