అనంతపురం జిల్లా పామిడిలోని ఓ దాబాలో హైటెక్ వ్యభిచారం నడుపుతున్నారు. వాట్సాప్ లలో బేరాలు సాగిస్తూ.. యథేచ్చగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. చూడటానికి ఈ దాబా ఓ రేకుల షెడ్డులాగా కనపడుతుంది. కానీ.. మామూలు దాబాల్లాగా అందులో ఫుడ్ దొరకదు.
కేవలం వాట్సాప్‌ ద్వారానే వ్యాపారం నడుస్తోంది. ఎంత సొమ్ము చెల్లిస్తే అంత మంచి అమ్మాయిలను అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు బేరాలు సాగిస్తున్నారు. అమ్మాయి ఫోటోతోపాటు వారి ధరలను కూడా వాట్సాప్ లోనే పంపిస్తున్నారు. 
సమీపంలోని కాలేజీ అమ్మాయిలను ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దాబాలో మహిళలు అందుబాటులో ఉండటంతో చీకటి వ్యాపారానికి రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పోతోంది. ఈ కార్యక్రమాలకు కొందరు పోలీసు అధికారులు సహాయసహకారాలు అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.