విజయనగరం జిల్లాలో దారుణం...దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్

First Published 16, Apr 2018, 6:42 PM IST
Handicapped woman gang rape at vijayanagaram
Highlights

జమ్మూ కాశ్మీర్ లో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల చిన్నారిపై, ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావో లో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం ఘటనలతో దేశం మొత్తం ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి దారుణ ఘటనే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ దివ్యాంగురాలిపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. యువతి ఆర్తనాదాలు విని ఓ వ్యక్తి సంఘటనను గుర్తించి యువతిని కాపాడాడు. లేదంటే ఈ కామాంధులు యువతిని ఇంకా ఎన్ని చిత్రహింసలు పెట్టేవారో.

ఈ అత్యాచార ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇదే జిల్లాలోని పూసపాటిరేగకు చెందిన ఓ వికలాంగురాలు విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్‌లోని తన అక్క ఇంటికి ఒంటరిగా బయలుదేరింది. పూల్ బాగ్ కు వెళ్లేందుకు కోట కూడలి వద్ద రాత్రి 8గంటలకు ఓ ఆటో ఎక్కింది. అయితే ఆమె అంగవైకల్యాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. దీంతో ఆటోలో తన ఇద్దరు స్నేహితులతో పాటు యువతిని ఒంటరిగా తీసుకుని బయలుదేరాడు. వీరు ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ కు కాకుండా నెల్లిమర్ల పరిధిలోని డీటీసీ రోడ్డు పక్కన గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్ల పొదల్లోకి అమ్మాయిని లాక్కుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అయితే యువతి ఆర్తనాదాలు విని అలువైపు వెళుతున్న ఓ వ్యక్తి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన ఈ ముగ్గురు పారిపోయారు. అతడు యువతి బంధువులకు సమాచారం అందిచడంతో వారు వచ్చి తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
 
loader