వచ్చే నెలలో హెచ్1 బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

వచ్చే నెలలో హెచ్1 బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హెచ్ 1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ వచ్చే నెల ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని యూఎస్ సీఐఎస్( అమెరికా పౌర వలస సేవల విభాగం) వెల్లడించింది. అదేవిధంగా హెచ్ 1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసాల ద్వారా అమెరికా వెళ్తుంటారు. హెచ్‌1-బీ వీసాలతో అమెరికాలోని కంపెనీలు భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి టెక్నాలజీ నిపుణులను వేల సంఖ్యలో నియమించుకుంటున్నాయి.

హెచ్‌1-బీ తాజా దరఖాస్తులు 2019 ఆర్థిక సంవత్సరం కోసం తీసుకుంటున్నారు.  2019 సంవత్సరానికి ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు చేస్తున్నామని, అయితే ఈ ఏడాదికి సంబంధించి 2018 సెప్టెంబరు 10 వరకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా ప్రజలకు సమాచారం ఇస్తామని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంచేసింది. హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల పరిశీలన సమయం తగ్గించేందుకే తాత్కాలికంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపేస్తున్నామని వెల్లడించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos