వీడు తండ్రేనా: కూతురిపై ఆరు నెలలపాటు రేప్

వీడు తండ్రేనా:  కూతురిపై ఆరు నెలలపాటు రేప్

గుర్గావ్: గుర్గావ్ లో దిగ్భాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. గుర్గావ్ సమీపంలోని పటౌడీలో గల గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో 13 ఏళ్ల బాలికపై తండ్రే అత్యాచారం చేశాడు. 37 ఏళ్ల వయస్సు గల ఆ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

తన కూతురితో తండ్రి శారీరక సంబంధం పెట్టుకోవడం అతి సాధారమైన విషయమని అతను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో అతని రెండో భార్య పట్టుకుంది. 

బాలిక మొదటి భార్య కూతురు. బాలికపై అతను అత్యాచారానికి పాల్పడిన విషయంపై ఆమెనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పటౌడీలోని కార్మికుడిగా అతను పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ ఆవరణలోని రెండో భార్య, నలుగురు పిల్లులు, బాధితురాలితో పాటు కలిసి ఉంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 

కూతురిపై అత్యాచారం చేసినందుకు అతను పశ్చాత్తాపపడుతున్నట్లుగా కూడా ఏమీ కనిపించలేదు. ప్రతి ఇంటిలోనూ లైంగిక దోపిడీ సాధారణమేనని బాలికకు చెప్పి మోసం చేశాడు. 

ఆరు నెలలుగా బాలికపై అతను అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నట్లు విచారణలో తేలింది. బయటకు చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. ఆ విషయాన్ని అంతకు ముందు బాలిక తన సవతి తల్లికి చెప్పింది. ఆమె నమ్మలేదు. శుక్రవారం సాయంత్రం పని నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. 

దాంతో బాలికతో ఉన్న అతను పట్టుబడ్డాడు. నిందితుడు బీహార్ కు చెందినవాడు. శనివారంనాడు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు, ప్రస్తుతం ఆమె సవతి తల్లితో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page