అర్థాంతరంగా గవర్నర్ తిరుగుముఖం: ఎందుకు?

Governor returns to Hyderabad
Highlights

మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని భావించిన గవర్నర్ నరసింహన్ అర్థాంతరంగా బుధవారం హైదరాబాదు బయలుదేరారు. 

హైదరాబాద్: మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని భావించిన గవర్నర్ నరసింహన్ అర్థాంతరంగా బుధవారం హైదరాబాదు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను కేంద్రం పెద్దలకు వివరించడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు.

ఆయన మంగళవారం రాత్రే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తెలుగు రాష్ట్రాలపై నివేదిక సమర్పించినట్లు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇటీవల ఆయన కలిశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

బిజెపి, తెలుగుదేశం పార్టీకి మధ్య నరసింహన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదని కాంగ్రెసు తెలంగాణ నేత వి. హనుమంతరావు అన్నారు. అర్థాంతరంగా ఢిల్లీ నుంచి గవర్నర్ హైదరాబాదు తిరుగుపయనం ఎందుకయ్యారనేది అర్థం కావడం లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉండడం వల్లనే ఆయన తిరిగి వచ్చినట్లు భావిస్తున్నారు. 

loader