గూగుల్ ఈ పేరు వినని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు.  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గూగుల్ కంపెనీ భారత్ లో భారీ ఉద్యోగాలు ఆఫర్ చేసింది. సేల్స్ అండ్ అకౌంట్ మేనేజ్ మెంట్, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ విభాగాలలో భారీ ఉద్యోగాలను ప్రకటించింది. గూగుల్ ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.

సేల్స్ అండ్ అకౌంట్ మెనేజ్ మెంట్ విభాగం..

బీఏ/బీఎస్సీ డిగ్రీ చదివి ఉండాలి, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం, టెక్నికల్/ సేల్స్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన అనుభవం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్, మంచి కమ్యునికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ విభాగం..

బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్, ఎంటెక్ చదివి ఉండాలి. ప్రోగ్రామింగ్ డెవలప్ మంట్ లో అనుభవం, మొబైల్ అప్లికేషన్ డెవలప్ మెంట్ లో అనుభవం, కమ్యునికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ అర్హతలు ఉంటే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కెరీర్స్. గూగుల్. కామ్ ని సంప్రదించండి