భారీగా పెరిగిన బంగారం ధర

First Published 24, Mar 2018, 5:33 PM IST
Gold Jumps To A Month High As Markets Spooked After Donald Trump Imposes Import Tariffs
Highlights
  • బంగారంపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

పెళ్లిళ్ల సీజన్ మళ్లీ దగ్గరపడటంతో.. బంగారానికి రెక్కలు వచ్చాయి. నేటి మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువ కావడంతో పసిడి ధర ఏడాది గరిష్ఠానికి చేరింది. శనివారం నాటి మార్కెట్లో రూ.85 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,835గా ఉంది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 39,600గా ఉంది.

చైనాపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెట్టడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మదుపర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరిస్తూ బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధరలు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్‌లో శుక్రవారం నాటి మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.37శాతం పెరిగి 1,346.80డాలర్లు పలికింది. వెండి కూడా 1.13శాతం పెరిగి ఔన్సు ధర 16.53 డాలర్లుగా ఉంది.

 

loader