రేప్ చేసి, అమ్మాయిని ఐదుగురు సజీవదహనం చేశారు

Girl raped and burnt alive in Jharkhand
Highlights

జార్ఖండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల వయస్సు గల అమ్మాయిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు.

రాంచీ: జార్ఖండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల వయస్సు గల అమ్మాయిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. దాంతో ఆగకుండా ఆమెను సజీవంగా దహనం చేశారు. ఈ సంఘటన జార్ఖండ్ లోని చత్రా జిల్లాలో చోటు చేసుకుంది. 

తమ బంధువు ఇంట్లో పెళ్లికి వెళ్తున్న బాలికను నిందితులు బలవంతంగా లాక్కుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. 

ఐదుగురిని గ్రామ పంచాయతీ దోషులుగా నిర్ధారించింది. వారికి పంచాయతీ పెద్దలు 50 వేల రూపాయల జరిమానా వేశారు. పంచాయతీ పెద్దల తీర్పుతో చిక్కుల్లో పడిన నిందితులు వారితోనూ బాధిత బాలిక కుటుంబ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగారు. 

ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లి ఇంటికి నిప్పంటించారు. ఆ మంటల్లో బాలిక మరణించింది. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

loader