అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో ఇరకాటంలో పడ్డారు. ట్రంప్ తో తనకు శారీరక సంబంధం ఉందని ఇటీవల  పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి ఇంకా ట్రంప్ బయటపడనేలేదు.. మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ప్లేబాయ్ మ్యాగజైన్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ .. ట్రంప్ తో తనకు అఫైర్ ఉందని ప్రకటించింది. అంతేకాదు.. ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని.. దానిని క్యాన్సిల్ చేయాలని కోరతూ ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు.

‘2006-2007 మధ్య 10 నెలల పాటు నాకు, ట్రంప్‌కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. అప్పుడు మెలానియా తన కుమారుడు బారెన్‌కు జన్మనిచ్చింది. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తన లాయర్‌ కేత్‌ డేవిడ్‌సన్‌.. ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌తో రహస్య మంతనాలు జరిగాయి. నాకు తెలియకుండానే నాతో ఆ ఒప్పందంపై సంతకం చేయించారు’ అని కరెన్‌ దావాలో పేర్కొన్నారు. అంతేగాక.. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు అమెరికన్‌ మీడియా  కూడా తనకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ట్రంప్ స్పందించకపోవడం గమనార్హం.