ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్ సైట్  ఫ్లిప్‌కార్ట్‌ గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ సేల్‌తో మళ్లీ మన ముందుకు రాబోతుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, గేమింగ్‌ హార్డ్‌వేర్‌, ఆడియో యాక్ససరీస్‌పై  భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. అయితే ఏఏ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనుందో మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు. గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ సేల్‌లో భాగంగా లెనోవో ఫ్యాబ్‌ 2పై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ ఇస్తుంది. అదేవిధంగా లెనోవో ఫ్యాబ్‌ 2 ప్రొ ధర 30 వేల రూపాయల నుంచి 22,999కు తగ్గించింది. 

బెస్ట్‌ సెల్లింగ్‌ ల్యాప్‌టాప్‌లపై నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందించనుంది. ఇంటెల్‌ కోర్‌ ఐ5, కోర్‌ ఐ7 ప్రాసెసర్స్‌ ల్యాప్‌టాప్‌లను ఈ వెబ్‌సైట్‌ లిస్టు చేసింది. అదనంగా హోమ్‌ యూజ్‌ ల్యాప్‌టాప్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో లిస్ట్‌ అయ్యాయి. వీటి ధర 11,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెల్‌ నుంచి బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లను 17,990 రూపాయలకు, లెనోవో నుంచి 18,990 రూపాయలకు అందిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను కూడా బెస్ట్‌ ధరల్లో అందుబాటులో ఉంచింది. గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్‌ కింద 12వేల రూపాయల తగ్గింపును ఇస్తుంది. 

ఆపిల్‌, శాంసంగ్‌, లెనోవో, మైక్రోమ్యాక్స్‌, ఐబాల్‌ వంటి బ్రాండుల టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్‌ ఐప్యాడ్‌ మోడల్స్‌ ధర 24,900 రూపాయల నుంచి ప్రారంభమవనున్నాయి. ఐప్యాడ్‌ మోడల్స్‌ నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లెనోవో ట్యాబ్‌ 4 సిరీస్‌పై 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. అదనంగా శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌3పై 10,500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా దాదాపు 20గ్యాడ్జెట్లను రూ.వెయ్యి లోపు ధరకే అందించనున్నట్లు కూడా చెప్పింది.