ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో మరోసారి భారీ ఆఫర్లను మన ముందుకు తీసుకొస్తోంది. మే 15-19 వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, కెమెరాలు, స్పీకర్లు, ఇతర పరికరాలపై ఆఫర్లున్నాయి. 

అంతేగాక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేసినట్లయితే మరో 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇక స్మార్ట్‌ఫోన్ అభిమానులైతే ఈ షాపింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. నోకియా 6.1 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, శామ్సంగ్ గెలాక్సీ జే6, ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 లాంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.


Realme C1: 
రియల్ మీ సీ1 స్మార్ట్ ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 7,499 కాగా.. ఆఫర్ ధర రూ. 6.999.

Redmi Y2:

రెడ్‌మీ వై2.. 3జీబీ+32జీబీ స్టోరేజి స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ. 8,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 7,999.  

Oppo K1: 

ఒప్పో కే1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 16,990 ఉండగా.. ఆఫర్ ధర రూ. 14.490.

Nokia 5.1 Plus: నోకియా 5.1 ప్లస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 9,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 7,999.

Infinix Note 5: 4జీబీ+64జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 10,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 8,999.

Asus zenfone max pro M1: 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 8,499 ఉండగా.. ఆఫర్ ధర రూ. 7,999.

Honor 9 lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 8,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 7,999.

Honor 8x: 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ. 15,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 14,999గా ఉంది.

Honor 10 lite: 4జీబీ+64జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 13,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 12,999గా ఉంది. 

Redmi 6: 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 8,499 ఉండగా.. ఆఫర్ ధర రూ. 6,999గా ఉంది. 

Vivo Y81: 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 8,490.. ఆఫర్ ధర రూ. 7,999.

Realme C2: మే 15వ తేదీన మధ్యాహ్నం 12గంటలకు రూ. 5,999 ధరతో అమ్మకాలను ప్రారంభిస్తోంది. రియల్ 3 ప్రో, రెడ్ మీ నోట్ 7 ప్రో లాంటి మొబైల్ ఫోన్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇతర ఫోన్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.