విశాఖలో రేపు రోహిత్ రెచ్చిపోవచ్చు...ఎందుకంటే..

విశాఖలో రేపు రోహిత్ రెచ్చిపోవచ్చు...ఎందుకంటే..

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ ప్రారంభం కావడానికి మరెంతో సమయం లేదు. రెండు వన్డే మ్యాచుల్లో ఒకటి శ్రీలంక విజయం సాధించగా.. మరోకొటి భారత్ కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డేపై ఆసక్తి మరింత పెరిగింది. అందులోనూ విశాఖపట్నంలో మ్యాచ్ అనే సరికి భారత్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకు కారాణాలు లేకపోలేదు.

స్వదేశంలో భారత జట్టుకు బాగా అచ్చొచ్చిన మైదానాల్లో విశాఖలోని మైదానం ఒకటి. ఇక్కడ అన్ని ఫార్మాట్లలో కలిపి పది అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడితే.. భారత్ ఓడింది కేవలం ఒక్కమ్యాచ్ లోనే. కాబట్టి.. ఈ మ్యాచ్ కూడా  గెలిచే అవకాశం ఉందనే పాజిటివ్ నెస్ ఉంది. అంతేకాకుండా.. ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ గా వ్యహరిస్తున్నాడు. అంతేకాకుండా విశాఖతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకం.

 రోహిత్ పుట్టింది బాన్సాడ్.. ప్రస్తుతం ఉంటున్నది ముంబయిలో అన్న విషయం అందరికీ తెలిసినా.. విశాఖ ఆయన అమ్మమ్మగారి ఊరన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రోహిత్ వాళ్ల అమ్మ పూర్ణిమ పుట్టింది విశాఖలోనే. అంటే ఇంచుమించు రోహిత్ కి ఇది సొంత గడ్డ అనే చెప్పవచ్చు. అలాంటి గడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం ఇప్పుడు రోహిత్ కి వచ్చింది. అందులోనూ గత మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో రోహిత్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. తనకు విశాఖపట్నం, హైదరాబాద్ లో మ్యాచ్ ఆడటం అంటే చాలా ఇష్టమని గతంలో రోహితే స్వయంగా చెప్పడం గమనార్హం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos