ఎప్పుడూ అధికార పార్టీ, సీఎం కేసీఆర్ భజన చేసే గవర్నర్ నరసింహన్ తన ఇంటిపేరును కల్వకుంట్ల గా మార్చుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో పేరుతో లక్షలకోట్ల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ వృధా చేస్తుంటే, హెచ్చరించాల్సిన గవర్నరే ఆహా, ఓహో అంటూ పొగుడుతున్నారిని పొన్నం మండిపడ్డారు.

సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిర టీఆర్ పార్టీ ఈ నాలుగఏళ్లలో చేసి అభివృద్ది ఏమిటో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. ఈ ప్రశ్ననే టీఆర్ఎస్ కార్యకర్తలు ప్లీనరీ సభలో ప్రశ్నించాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిపెస్టోలోని ఎన్ని హామీలు అమలుపర్చారో తెలియజేస్తూ ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు చేసిన పనులనే పేర్లు మార్చి, రీడిజైన్ చేసి టీఆర్ పార్టీ ఖాతాలో వేసుకుంటున్నారని పొన్నం విమర్శించారు. తెలంగాణ లో ఓ నియంత పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రేం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ , ఇంటికో ఉద్యోగం పథకాలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. వీటిని ప్రచారానికి వాడుకోవడం కాదని, వీటి అమలు  వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.