ఫెడరల్ ప్రంట్ కోసం మరో ముందడుగు వేసిన కేసీఆర్

ఫెడరల్ ప్రంట్ కోసం మరో ముందడుగు వేసిన కేసీఆర్

దేశంలో జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోడానికి జతీయ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా వున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఓ ఫెడరల్ ప్రంట్ ను ఏర్నాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఇదివరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లను కలిసి ఈ విషయంపై చర్చించారు. తాజాగా ఈ ప్రంట్ కోసం తన కార్యాచరణను సీఎం కేసీఆర్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ చెన్నైకి పయనమైన కేసీఆర్ అక్కడ ప్రతిపక్ష డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు.

చెన్నైలో ప్రతిపక్ష డీఎంకు అధినేత కరుణానిధి, ఆయన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో కేసీఆర్ ప్రంట్ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు. ఈ విషయంపై పలువురు డీఎంకే నేతలు  గత మూడు రోజుల క్రితమే కేసీఆర్ తో చర్చలు జరిపారు. వీరి ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ తో పాటు పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, ఎంపీ కవితలతో కూడిన బృందం చెన్నైకి వెళుతున్నారు. ఈ చర్చల అనంతరం తిరిగి ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. 
    
ఇక మే నెలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఇందుకోసం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం. ఆయన్ని ఫెడరల్ ప్రంట్ అంశంపై చర్చించడానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ద్వారా సీఎం ఆహ్వానాన్ని పంపారు. దీంతో అఖిలేశ్ హైదరాబాద్ వచ్చి, సీఎం కేసీఆర్‌తో సమావేశమవనున్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos