కదులుతున్న కారులో అమ్మాయిపై ముగ్గురు గ్యాంగ్ రేప్

కదులుతున్న కారులో అమ్మాయిపై ముగ్గురు గ్యాంగ్ రేప్

నోయిడా: ఓ పదహారేళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు కదులుతన్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసినవాళ్లలో అమ్మాయి క్లాస్ మేట్ కూడా ఉన్నాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను రోడ్డు పక్కన పడేశారు. 

ఈ సంఘటన గతవారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకతను పరారీలో ఉన్నాడు.  11వ తరగతి చదువుతున్న అమ్మాయిని తాను ఇంటి వద్ద దింపుతానంటూ కారులో ఎక్కించుకున్న క్లాస్ మేట్ ఆ పని చేయకుండా మరో ఇద్దరితో కలిసి ఆమెపై గంటల పాటు కారులోనే అత్యాచారం చేశాడు. 

గత బుధవారంనాడు స్కూల్ బస్సు మిస్ కావడంతో కాలినడకన ఇంటికి బయలుదేరింది. దాంతో క్లాస్ మేట్, అతని మిత్రులు ఇంటి వద్ద దింపుతామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. 

తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది. బాలిక గంటల పాటు కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన స్పృహ తప్పిపడి ఉన్న ఆమెను పోలీసులు గుర్తించారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos