వాట్సాప్ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోన్న ఓ వాట్సాప్ గ్రూప్ గుట్టురట్టయింది.  ఈ గ్రూప్ గుట్టురట్టు చేయడంతోపాటు ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.  అడ్మిన్ తోపాటు ఈ గ్రూప్‌లో సభ్యులుగా వున్న 114 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ అయిన అడ్మిన్‌ని ఉత్తర్ ప్రదేశ్‌లోని కనౌజ్‌కి చెందిన నిఖిల్ వర్మ (20) గా గుర్తించారు. నిఖిల్ వర్మని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి ఓ ల్యాప్‌టాప్, మొబైల్, హార్డ్ డిస్కులని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించడం కోసం దర్యాప్తు బృందం ఢిల్లీ, నొయిడాల్లో తనిఖీలు జరిపింది. గత రెండేళ్లుగా యాక్టివ్‌గా వున్న ఈ వాట్సాప్ గ్రూప్‌లో చైనా, పాకిస్థాన్, అమెరికా, బ్రెజిల్, అఫ్ఘనిస్థాన్, కెన్యా, నైజీరియా, శ్రీలంక దేశస్థులు కూడా ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులు పోర్న్ వీడియోలు, సమాచారం పంచుకున్నట్టుగా గుర్తించిన ఇంటెలీజెన్సీ వర్గాలు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వీళ్ల బాగోతం బయటపడింది.