అంబేడ్కర్ బ్రాహ్మణుడు, మోడీ కూడా: గుజరాత్ అసెంబ్లీ స్పీకర్

అంబేడ్కర్ బ్రాహ్మణుడు, మోడీ కూడా: గుజరాత్ అసెంబ్లీ స్పీకర్

గాంధీనగర్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణుడని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆదివారంనాడు అన్నారు. బీఆర్ అంబేడ్కర్ ను బ్రాహ్మణుడని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదని అన్నారు. 

జ్ఞానిని బ్రాహ్మణుడిగా చెప్పడంలో తప్పు లేదని అన్నారు. రాజేంద్ర త్రివేది బిజెపి తరఫున వడదొరాలోని రావుపురా నుంచి పోటీ  చేసి శాసనభకు గెలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బ్రాహ్మణుడేనని అన్నారు. 

గాంధీనగర్ లో జరిగిన మెగా బ్రాహ్మిణ్ బిజినెస్ సమ్మిట్ లో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాజేంద్ర త్రివేది ఆ విధంగా అన్నారు. 

ఆదివారంనాడు జార్ఖండ్ లోని గిరిధిహ్ లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉదయం తమకు సమాచరాం అందిందని, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చే్సాతమని, నిందితులను పట్టుకోవాలని కోరుతామని స్థానికులు చెప్పారు. 

అలహాబాదులోని సిద్ధార్థనగర్ లో 24 గంటల వ్యవధిలో మార్చిలో రెండు అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos