చాలా మంది దంపతులు.. పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడానికి ఆసక్తి చూపరు. అలాంటి వాళ్లు కొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిలో కండోమ్ , గర్భ నిరోదక మాత్రలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే.. అవాంచిత గర్భాన్ని నిరోధించడానికి అమ్మాయిలు ‘ఐపిల్’ తదితర ట్యాబెలెట్స్ ని వేసుకుంటూ ఉంటారు. ఇక ముందు నుంచి అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా గర్భనిరోదక మాత్రలు వేసుకోవచ్చు. మీరు చదివింది నిజమే. ప్రత్యేకంగా మగవారి కోసం ‘ మేల్ పిల్’ ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు దాదాపు 100మంది పురుషుల మీద ఈ ‘మేల్ పిల్’ ని ప్రయోగించారు కూడా. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావని, భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్య తలెత్తదని వారు చెబుతున్నారు. చాలా మంది పురుషులు వెంటనే పిల్లలు పుట్టకుండా ఉండేదుకు ఇంజెక్షన్స్, టాపికల్ జెల్స్ ని వాడుతుంటారు. అయితే.. అవి ఎక్కువ కాలం ప్రభావం చూపుతున్నాయని సమాచారం. అందుకే.. డెయిలీ పిల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. అలాంటి వారికోసమే ఈ మెన్ పిల్ ని తయారు చేసినట్లు చెబుతున్నారు. నెలరోజులు వరసగా రోజుకో పిల్ వేసుకున్నప్పటికీ ఏ ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ పిల్ స్పెర్మ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. ఈ పిల్స్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.