Asianet News TeluguAsianet News Telugu

బజాజ్ నుండి మార్కెట్లోకి సరికొత్త వాహనం... 16 ఏళ్ల కుర్రకారు నడిపేందుకూ అనుమతి

దేశీయ ఆటోమొబైల్ మేజర్ బజాజ్ ఆటో.. భారత విపణిలోకి ఖ్వాడ్రి సైకిల్ తొలి మోడల్ కారు ‘క్యూట్’ను రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రవేశ పెట్టింది. దీని ధర రూ.2.62 లక్షలుగా ఉంది. అంతేకాదు 16 ఏళ్ల కుర్రాళ్లు కూడా నడపొచ్చు.

Bajaj launches quadricycle Qute in Rajasthan
Author
Rajasthan, First Published Mar 27, 2019, 2:22 PM IST

న్యూఢిల్లీ/ జైపూర్: ఎంతో ఆసక్తిగా వినియోగదారులు ఎదురుచూస్తున్న ఖ్వాడ్రి సైకిల్‌ భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. తొలి ఖ్వాడ్రిసైకిల్‌ను బజాజ్‌ ఆటో లాంఛనంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ కేంద్రంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.62 లక్షలుగా ఉంది. 

ఇందులో పెట్రోల్‌ వెర్షన్‌ లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌, ఇతర ఇంధనాలతో బజాజ్‌, మరికొన్ని కంపెనీలు దీన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయి. నలుగురి ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఖ్వాడ్రి సైకిల్ 16 ఏళ్ల కుర్రాళ్లూ నడిపేందుకు అనుమతి ఉంది. 

బజాజ్‌ ఆటో క్వాడ్రిసైకిల్‌ ‘క్యూట్‌’ తక్కువ నిర్వహణా వ్యయాలు గల వాహనాలు కావాలన్న డిమాండ్‌ను తీరుస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ సురక్షితమైనదని, నగర రవాణాలకు అనుకూలమైనదని బజాజ్‌ ఆటో జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌ వర్మ అన్నారు. ఇది పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. 

రాజస్థాన్‌లో పెట్రోల్ వర్షన్ ఖ్వాడ్రీ సైకిల్ ‘క్యూట్’ ధర రూ.2,62,193, సీఎన్జీ వర్షన్ వాహనంధర రూ.2,82,239గా నిర్ణయించారు. దీన్ని 2012 ఆటో షోలోనే ప్రదర్శించినా వివిధ కార్ల ఉత్పత్తిదారుల నుంచి ఎదురైన న్యాయ పోరాటం వల్ల ఇంత కాలం మార్కెట్లో విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఈ శ్రేణి వాహనాలకు వర్గీకరణ లేకపోవడం కూడా అవరోధంగా నిలిచింది.
 
గతేడాది రవాణా మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్‌ వాహనాలను అధికారికంగా గుర్తించడంతో దీని విడుదలకు మార్గం సుగమం అయింది. ఇది నగరాలు, గ్రామాల్లోని ఇరుకైన రహదారుల్లోనూ ఈ వాహనాల రవాణాకు ఎంతో అనువుగా ఉంటుంది. క్వాడ్రిసైకిల్‌ గరిష్ఠ బరువు 475 కేజీలు మించరాదన్న నిబంధనకు అనుగుణంగా దీని బాడీని షీట్‌ మెటల్‌, ప్లాస్టిక్‌తో తయారుచేశారు. 

తలుపులు, బాయ్ నెట్‌ కూడా ప్లాస్టిక్‌తో తయారుచేశారు. ఈ వాహనానికి ఏసీ అవకాశం లేదు. అయితే 12 వోల్టుల చార్జింగ్‌ సాకెట్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌ మాత్రం అమర్చారు. భద్రత కోసం వాహనంలో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టులు ఏర్పాటు చేశారు. 

దీనికి 216 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఫోర్‌ స్ర్టోక్‌, డీటీఎస్ఐ ఇంజన్‌ అమర్చారు. ఐదు గేర్లు ఉంటాయి. ఐదో గేరులో గంటకి గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో క్యూట్‌ ప్రయాణిస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్ 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ వర్షన్ ఖ్వాడ్రి సైకిల్ 43 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios