న్యూఢిల్లీ: బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బిజెపి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు బి. శ్రీరాములును పోటీకి దించింది. చాముండేశ్వరిలోనే కాకుండా సిద్ధరామయ్య బాదామిలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

చాముండేశ్వరిలో తీవ్రమైన పోటీ ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానాన్ని ఒప్పించి తనకు సురక్షితమని భావించి బాదామీ నియోజకవర్గంలో కూడా ఆయన పోటీకి దిగారు. 

అయితే, బిజెపి శ్రీరాములును పోటీకి దించడం ద్వారా సిద్ధరామయ్యకు బాదామిలో సవాల్ విసిరింది. బాదామిలో తనపై ఎవరూ పోటీ చేస్తారనే విషయంపై తనకు పట్టింపు లేదని, శ్రీరాములు లేదా యడ్యూరప్ప ఎవరైనా ఫరవా లేదని, ఓటర్లపై తనకు నమ్మకం ఉందని, వాళ్లు తనతోనే ఉంటారని సిద్ధరామయ్య అన్నారు. 

శ్రీరాములుకు తొలుత మొల్కల్మూరును బిజెపి ఖరారు చేసింది. అక్కడ ఆయన పోటీ నుంచి విరమించుకోవచ్చు.