కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన చంద్రబాబు

కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై ఏపి సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని, తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని విభజన చట్టంలో వున్న హామీలను, మోదీ తిరుపతి సభలో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామని గుర్తుచేశారు చంద్రబాబు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  చంద్రబాబు ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలి రాజకీయాలు మాత్రమే చేస్తోందని మండిపడ్డారు. ఏపిలో ఉనికిని కోల్పోవడంతోనే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఎపి పై అంత ప్రేమే ఉంటే ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించేవారని, లేదు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  

ఇక గవర్నర్ వ్యవస్థపైనా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తాను కేంద్ర ప్రభుత్వానికి ఈ గవర్నర్ వ్యవస్థే వద్దని చెప్పానని, రాష్ట్రాలకు ఈ గవర్నర్ లు అవసరమే లేదని చెప్పినట్లు తెలిపారు.  

మనం తిరుపతి వెంకన్న సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చుకునే వరకు పోరాడదామని ప్రజలకు సూచించారు. రాష్ట్ర అభివృద్దికి అడ్డు రాకూడదనే ఈ నాలుగేళ్లు సహనం వహించానని, ఇపుడు సమయం వచ్చింది కాబట్టి కేంద్రంపై తిరగబడ్డామన్నారు. తిరుపతి సభలో ఇచ్చిన హామీలను నేరవేర్చేలా వెంకన్న స్వామే కేంద్రానికి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
  
2019 లోక్ సభ ఎన్నికల్లో ఎపిలోని 25 సీట్లలో గొలుపొంది ప్రదానిని మనమే నిర్ణయించేలా చేసి, మన సత్తా ఏంటో తెలియజేయాని చంద్రబాబు సూచించారు. కేంద్రంతో జరుపుతున్న ఈ పోరాటంలో తనకు వలయంగా నిలబడి కాపాడాలని చంద్రబాబు ప్రజలను కోరారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page