ముగిసిన ఆళ్లగడ్డ పంచాయితీ ; సీఎం చంద్రబాబు ఆదేశాలతో

ముగిసిన ఆళ్లగడ్డ పంచాయితీ ;  సీఎం చంద్రబాబు ఆదేశాలతో

గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కొనసాగుతున్న ఆళ్లగడ్డ పంచాయితీకి  ఎట్టకేలకు శుభం కార్డు పడింది. సీఎం చంద్రబాబును ఇవాళ మంత్రి అఖిలప్రియ,  ఏవీ సుబ్బారెడ్డి లు కలిశారు. ఈ సందర్భంగా మొన్న ఏవీ పై జరిగిన రాళ్లదాడి గురించి ప్రస్తావించిన సీఎం ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కండా చూడాలని వారికి సూచించారు. పార్టీ కోసం ఇద్దరు కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత విబేధాలను వదిలి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని చంద్రబాబు వారికి హితవు పలికారు. ఇలా ఇరు నేతల మద్య ఎట్టకేలకు సీఎం రాజీ కుదిర్చారు. 

చంద్రబాబుతో మీటింగ్ అనంతరం మంత్రి అఖిల ప్రియ, సుబ్బారెడ్డిలు కర్నూల్ జిల్లా టిడిపి ఇంచార్జి వర్ల రామయ్య తో కలిసి మీడియాలో మాట్లాడారు. అఖిల ప్రియ మాట్లాడుతూ... ఇక నుంచి అందరం కలిసే పని చేస్తామని తెలిపింది. విభేదాలను పక్కనపెట్టి ఆళ్లగడ్డ లో ఎలాంటి ఘర్షణలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తాం. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా వున్న సీఎం చంద్రబాబు మాటలను శిరసా వహిస్తామని తెలిపింది.

 ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ...సీఎం ఆదేశాల ప్రకారం వ్యక్తిగత విమర్శలు, గొడవలు లేకుండా పని చేస్తామని చెప్పారు. అందరిని కలుపుకు పోతూ పార్టీ కోసం పనిచేయాలని సీఎం సూచించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సూచనలను పాటిస్తానని ఏవీ వివరించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos