ఏంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందురుచూస్తున్న ఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారికి తీయని కబురు అందజేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 యూనివర్శిటీల్లో 1109 అసిస్టెంట్ పోస్టుల భర్తీలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏపీపీఎస్సీసీ ద్వారా ఈ నియమక ఎంపిక ప్రక్రియ చేపడతామని ఆయన బుధవారం మీడియా కి తెలిపారు. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాతపీరక్ష, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.