ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్.. శాంసంగ్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.  శాంసంగ్ కార్నివాల్ పేరిట స్పెషల్ సేల్ ని ఏర్పాటు చేసింది. బుధవారం  ప్రారంభమైన ఈ సేల్ 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో పలు శాంసంగ్ ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, తగ్గింపు ధరలు వినియోగదారులకు లభిస్తున్నాయి. 

శాంసంగ్ కార్నివాల్ ప్రత్యేక సేల్‌లో గెలాక్సీ నోట్ 8 ఫోన్‌ను అమెజాన్ పే వాలెట్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.8వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక ఈ సేల్‌లో గెలాక్సీ ఎ8 ప్లస్ రూ.28,990, ఆన్7 ప్రైమ్ 64జీబీ రూ.12,990, ఆన్7 ప్రైమ్ రూ.10,990, ఆన్7 ప్రొ రూ.6,990, ఆన్5 ప్రొ రూ.6,490 ధరలకు లభిస్తున్నాయి. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా ఈ సేల్‌లో అందిస్తున్నారు.