లైవ్ షోలో బూతులు తిట్టుకున్న రోజా, బండ్ల గణేష్

లైవ్ షోలో బూతులు తిట్టుకున్న రోజా, బండ్ల గణేష్

రోజురోజుకీ టీవీ కార్యక్రమాలు జుగుప్సాకరంగా మారిపోతున్నాయి. స్థాయిని మరిచి ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు. అది ఒక టీవీ కార్యక్రమమని, జనాలు అందరూ చూస్తున్నారనే విషయాన్ని కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. కొందరైతే ఏకంగా అక్కడే కొట్టుకుంటున్నారు కూడా. టీవీ ఛానెల్స్ కూడా టీఆర్పీ రేట్ల కోసం ఇలాంటి కార్యక్రమాలనే ప్రోత్సహించడం గమనార్హం. తాజాగా ఇలాంటి మరో సంఘటన చర్చనీయాంశమైంది.

సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకి, నిర్మాత బండ్ల గణేష్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది. లైవ్ షోలో ఒకరిని మరోకరు బూతులు తిట్టుకున్నారు. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో వీరిద్దరూ ఇలా దూషించుకోవడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే.. వారసత్వ రాజకీయాల గురించి ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్ లో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారని, ఆయన తమ్ముళ్లు, కొడుకు, అలుళ్లు మాత్రం చిరంజీవి పేరు చెప్పుకోని సినిమాల్లోకి అడుగుపెట్టారని రోజా విమర్శించారు. చిరంజీవి అనే వాడు లేకపోతే.. మెగా కాంపౌండ్ హీరోలకు అసలు వేరెవ్వరూ ఛాన్సులు ఇచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు.

ఈ సమయంలోనే బండ్ల గణేష్ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని వాడు వీడు అని మాట్లాడితే ఊరుకోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి గౌరవం ఇచ్చి మాట్లాడాలని హితవు పలికారు. బండ్ల మాటలను రోజా కూడా తీవ్రంగానే స్పందించారు. దీంతో మరింత రెచ్చిపోయిన బండ్ల.. రోజా లెగ్ కారణంగానే రాజశేఖర్ రెడ్డి చనిపోయారని, గొప్ప నాయకురాలివంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

 దీంతో.. ఆగ్రహించిన రోజా.. పళ్లు రాలగొడతానంటూ  బండ్లని హెచ్చరించగా.. తాను కూడా పళ్లు రాలగొడతానని బండ్ల పేర్కొన్నారు. అనంతరం రోజా ఫోన్ లైన్ కట్ అయ్యింది. వీరిద్దరి సంభాషణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page