అమ్మలాంటి ఆయమ్మే ఆ నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసింది

Aaya held for sex abuse of child at mumbai
Highlights

రెండు నెలలుగా చిన్నారిపై పైశాచికత్వం  

ఓ వైపు చిన్నారులపై కామాంధుల ఆకృత్యాలు ఎక్కువయ్యాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుండగా ముంబైలో మరో ఘోరం జరిగింది. పాఠశాలలో చిన్నారులకు రక్షణగా ఉండాల్సిన ఓ ఆయా నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టింది. అభం శుభం తెలియని పాపను ఏకంగా స్కూళ్లోనే లైంగికంగా వేధించింది. చిన్నారి కూడా తనలాగే ఓ ఆడపిల్ల అని మరిచి నీచానికి పాల్పడింది. 

దేశ వ్యాప్తంగా అమ్మాయిల, ముఖ్యంగా చిన్నారుల రక్షణకోసం మహిళలంతా రోడెక్కి నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముంబై లో ఓ మహిళా ఆయా ఓ చిన్నారిపై లైంగికదాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ధనవంతులు నివసించే ప్రాంతం మజగావ్ లో ఓ కిండర్ గార్డెన్ స్కూల్ ఓ నాలుగేళ్ల చిన్నారి చదువుతోంది. అయితే రెండు నెలలుగా స్కూల్ అంటేనే చిన్నారి బయపడుతోంది. దీంతో తల్లలిదండ్రులు బుజ్జగించగా అసలు విషయాన్ని చెప్పింది. తనపై స్కూళ్లో ఆయా లైంగిక దాడికి పాల్పడినట్లు పాప తెలిపింది. అయితే పాప మాటలతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు పాపకు వైద్య పరీక్షలు చేయించారు. అందులో కూడా చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని విషయం తెలియజేశారు.


దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పాఠశాలకు చేరుకున్న బైకుల్లా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా తానే ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు.

loader