Asianet News TeluguAsianet News Telugu

కండోమ్ ఉందిగా... అంటున్న పెళ్లికాని అమ్మాయిలు

  • పెరిగిన కండోమ్ వినియోగం
  • కండోమ్ వినియోగంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్న పెళ్లి కాని అమ్మాయిలు
A larger number of unmarried sexually active women are now opting for safe sex

కాలానుగుణంగా మనుషుల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా మార్పు వచ్చింది. అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న అమ్మాయిలు.. ‘‘సెక్స్’’ విషయంలోనూ ఒక అడుగు ముందుకేస్తున్నారు.. అది కూడా పెళ్లికాకముందే. మీరు చదివింది నిజమే.. పెళ్లి కాకముందే అమ్మాయిలు.. లైంగిక చర్య వైపు ఆసక్తి చూపిస్తున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి.

A larger number of unmarried sexually active women are now opting for safe sex

విషయం ఏమిటంటే... కేంద్ర ఆరోగ్య  మంత్రిత్వ‌శాఖ ప్ర‌తీ సంవ‌త్స‌రం నేష‌నల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే నిర్వ‌హిస్తుంది. అలా 2015 -16లో నిర్వ‌హించిన స‌ర్వేలో కంగుతినే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌డిచిన ద‌శాబ్ధ‌కాలంగా పెళ్లికాని అమ్మాయిల్లో కండోమ్స్ వినియోగం ఆరురేట్లు  పెరిగినట్లు తేలింది. పెళ్లి కాకుండా లైంగిక చ‌ర్య‌ల్లో పాల్గొన్న అమ్మాయిలు కండోమ్స్ వినియోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 15ఏళ్ల నుంచి 49ఏళ్లలోపు మహిళలు ఈ జాబితాలో ఉన్నారు.

అయితే.. దీనికి ఓ కారణం ఉందటుంటున్నారు ఆరోగ్యశాఖ అధికారులు. కేవలం సెక్స్ పట్ల ఆసక్తితో వారు ఇలా చేయడం లేదంటున్నారు. కొంత‌మంది మ‌హిళ‌లు త‌మ‌కుటుంబాలు ఆర్ధికంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నాల్లో పెళ్లి చేసుకోవ‌డంలేదని అంటున్నారు. ఇంకొంత‌మంది సహ‌జీవ‌నానికి , మ‌రికొంత‌మంది త‌మ జీవిత‌ల‌క్ష్యాల్ని నెర‌వేర్చుకునే ప‌నిలో ఉన్నార‌ని , పెళ్లిళ్లు చేసుకుంటే త‌మ ఆశ‌యాలు మ‌రుగున ప‌డిపోతాయ‌ని అందుకే పెళ్లిళ్లు చేసుకోవ‌డంలేద‌నే విష‌యాల్ని ప‌లు సంస్థ‌ల ద్వారా సేక‌రించిన వివ‌రాల ఆధారంగా నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే లో వెల్ల‌డైంది.

అంతేకాదు పెళ్లికి ముందుకు లైంగిక చ‌ర్య‌ల్లో పాల్గొనే వారి  సంఖ్య ఆరు రేట్లు పెరిగిన‌ట్లు స‌మాచారం. 15 నుంచి 49ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు మ‌హిళ‌లు లైంగిక చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. వీరిలో వివాహం అయిన వారు కుటుంబ నియంత్ర‌ణ‌కే మొగ్గుచూపుతుండగా..  20 నుంచి 24ఏళ్ల మ‌ధ్య‌వ‌య‌సు గ‌ల పెళ్లి కాని మ‌హిళ‌లు కండోమ్స్ వాడుతున్నారు.  8 మంది మహిళల్లో  ప్ర‌తీ ముగ్గురు మ‌హిళ‌ల‌కు కొన్ని అజాగ్ర‌త్త‌ల కార‌ణంగా  గర్భం దాల్చుతున్నట్లు సర్వేలో తేలింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios