Asianet News TeluguAsianet News Telugu

మొదటిసారి సెక్స్: అమ్మాయిల స్పందన ఏంటి..?

  • నేరుగా అమ్మాయిలని అడిగితే కచ్చితంగా ఒప్పుకోరు. కానీ.. ఈ కింది వాటిలో ఏదో ఒకటి ప్రతి అమ్మాయి చేసే ఉంటుంది.
6 awkward embarrassing things every woman does after sex but will never admit

అమ్మాయిల విషయంలో.. అబ్బాయిలకు చాలా సందేహాలు ఉంటాయి. ప్రేమ, తొలి ముద్దు, సెక్స్ ఇలా ఏదైనా సరే.. అబ్బాయిలు ప్రతీదీ వారి స్నేహితులతో పంచుకుంటారు. మరి అమ్మాయిలు ఏం చేస్తారు..? మొదటి సారి సెక్స్ లో పాల్గొన్న తర్వాత అమ్మాయిలు ఏలా ఫీలౌతారు..? ఏం చేస్తారో ఇప్పుడు చూద్దామా.. ఈ విషయాలు నేరుగా అమ్మాయిలని అడిగితే కచ్చితంగా ఒప్పుకోరు. కానీ.. ఈ కింది వాటిలో ఏదో ఒకటి ప్రతి అమ్మాయి చేసే ఉంటుంది.

1. సెక్స్ గురించి చాలా మంది అమ్మాయిల్లో చాలా అపోహలు ఉంటాయి. వాటి గురించి ఎక్కడో చదివింది. ఎవరో చెప్పింది నిజమని భావిస్తుంటారు. ఇలా భావించేవారిలో చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత.. వెంటనే వాష్ రూమ్ కి వెళ్లిపోయి.. శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు.

2. అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు. 

3. వీళ్లు ఇంకోరకం అమ్మాయిలు. పెళ్లికాకుండా తొలిసారి శృంగారంలో పాల్గొన్న అమ్మాయిలు చేసే పని ఇది. వెంటనే గుడికి వెళ్లో లేదా.. మనసులోనే దేవుడిని ప్రార్థిస్తుంటారు. తాను తప్పు చేసానని.. క్షమించాల్సిందిగా దేవుడిని కోరుకుంటారు.

4. ఇంకొందరేమో.. సెక్స్ చేసిన వెంటనే.. లవర్, భర్త ని సూటిగా ఒక ప్రశ్న అడిగేస్తారు. ఏమిటా ప్రశ్న అంటారా... నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా..? నేనంటే నీకు ఇష్టమేనా..? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపు 70శాతం మంది మహిళలు చేసే పని ఇదే.

5.ఇంకొందరేమో.. వెంటనే కూర్చొని ఏడ్చేస్తుంటారు. తొందరపడి తప్పు చేశానని.. అలా చేసి ఉండకూడదని ఫీలౌతూ.. కంట్లో కొళాయి తిప్పేస్తుంటారు. మరికొందరేమో.. శృంగారంలో పాల్గొన్న వెంటనే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందో? అనే భయంతో.. గర్భనిరోధక మాత్రలు మింగేస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios