Asianet News TeluguAsianet News Telugu

బ్లూలింక్ టెక్నాలజీ తొలి సెడాన్: విపణిలోకి హ్యుండాయ్​ ఎలంట్రా

భారత్‌లోకి హ్యూండయ్ సరికొత్త కారును విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన కార్ల కంటే ఈ కారు విభిన్నమైన మోడల్స్ లో ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది.

2019 Hyundai Elantra Launched at Rs 15.89 Lakh in India, Gets Blue Link Connected Tech
Author
Hyderabad, First Published Oct 4, 2019, 12:51 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్‌ భారత మార్కెట్లోకి సరికొత్త ఎలంట్రాను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

ఈ కారులో బ్లూలింక్‌ కనెక్టెడ్‌ కారు టెక్నాలజీని వినియోగించారు. భారత్‌లో సెడాన్‌ విభాగంలో ఈ టెక్నాలజీని వినియోగించిన తొలి మోడల్​ కారు ఇదే.

బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్​ను ఈ మోడల్​ కారును విపణిలో ఆవిష్కరించింది హ్యుండాయ్. ఈ కారు విభిన్నంగా.. ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఏటీ, ఎస్ఎక్స్ (ఓ) ఏటీ వేరియంట్లలో రానున్నది. ఎలంట్రా కొత్త వెర్షన్‌ కారులో 34 ప్రత్యేక ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. 

హ్యుండాయ్ ఎలంట్రా మోడల్ కారు హెడ్‌ల్యాంప్స్‌, బంపర్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌లో మార్పులు చేశారు. ఈ కారు మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది.

వైర్‌లెస్‌ ఛార్జర్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌సీట్లు‌, ఇన్ఫినిటీ సౌండ్‌ సిస్టమ్‌, డోర్‌ స్పీకర్లు, సెంటర్‌ స్పీకర్లు‌, రియర్‌ ఏసీ, అల్యూమినియం పెడల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏబీఎస్‌, ఈబీడీ , ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, రియర్‌పార్కింగ్‌ సెన్సర్‌, హిల్‌ అసిస్టెంట్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి సేఫ్టీ ఫీచర్లూ ఉన్నాయి. 

ఇన్ఫినిటి సౌండ్ సిస్టమ్, ట్వీటర్లు, యాప్లిఫయర్, సబ్ ఊపర్, క్రూజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఎఫ్ఏటీసీ, క్లస్టర్ ఐనెజర్, రియర్ ఏసీ, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అల్యూమినియం ఫెడల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుండాయ్ మోటార్స్ ఎండీ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ ‘సరికొత్త ఎలంట్రా భారతదేశంలో తొలి కనెక్టెడ్ హైటెక్ సెడాన్ కారు. దీనిలో బీఎస్-6 పెట్రోల్ ఇంజి్ ఉంది. ఎలంట్రా సరికొత్త మార్క్‌ను నిర్దేశిస్తుంది’ అని చెప్పారు. ఈ కారు మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios